వైభవ్ ను తొలి బంతికే పెవిలియన్ పంపిస్తానని ముందే చెప్పా.. ప్రఫుల్ హింగె
- అరంగేట్ర మ్యాచ్ లో నాలుగు లేదా ఐదు వికెట్లు తీస్తానని అనుకున్నానన్న ప్రపుల్
- నామీద నాకున్న నమ్మకం అలాంటిదన్న ఎస్ఆర్ హెచ్ బౌలర్
- తొలి మ్యాచ్‌తోనే ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ దళానికి కీలక అస్త్రంగా మారిన హింగె
తొలి మ్యాచ్ లోనే నాలుగు వికెట్లు తీసి ఐపీఎల్ లో సంచలనం సృష్టించిన ప్రఫుల్ హింగె.. తన అరంగేట్ర మ్యాచ్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. విదర్భకు చెందిన హింగె ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్) తరఫున ఆడుతున్నాడు. అయితే, తన అరంగేట్ర మ్యాచ్ గురించి గతేడాదే రాసిపెట్టుకున్నానని హింగె చెప్పుకొచ్చాడు. తనకు అవకాశం వస్తే వైభవ్ సూర్యవంశీని తొలి బంతికే పెవిలియన్ పంపిస్తానని తన సన్నిహితులతో చెప్పానని అన్నాడు. అదేవిధంగా తొలి మ్యాచ్ లో నాలుగు లేదా ఐదు వికెట్లు తీస్తానని బలంగా నమ్మానని వివరించాడు. తనపై తనకున్న నమ్మకం అలాంటిదని హింగె చెప్పుకొచ్చాడు.
సోమవారం నాడు ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో నాలుగు కీలక వికెట్లు తీసి ప్రఫుల్ హింగె మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వైభవ్ సూర్యవంశీని నా మొదటి బంతికే ఔట్ చేస్తానని స్నేహితులతో చెప్పాను. అనుకున్నది సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని వివరించాడు. చిన్నప్పుడు క్రికెట్ ఆడతానంటే తండ్రి వద్దన్నా, పట్టుదలతో ఈ స్థాయికి చేరుకున్నానని ప్రఫుల్ గుర్తుచేసుకున్నాడు. తన తొలి అవార్డును కుటుంబానికి అంకితమిచ్చాడు. కాగా, రూ.30 లక్షల బేస్ ప్రైస్ కే సొంతం చేసుకున్న ప్రఫుల్ హింగె.. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలింగ్ దళంలో కీలకంగా మారాడు.